Thursday, May 9, 2013
Why did Ramcharan escaped from media
రాంచరణ్ ఎందుకు ఎస్కేప్ అయ్యాడు ?
ఆదివారం జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకునేందుకు మీడియా ముందుకు వచ్చిన రాంచరణ్ అక్కడ
విలేకరులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పకుండా మధ్యలోనే ముగించుకుని వెళ్ళిపోయాడు.
మొదట ఘటన జరిగిన తీరుతెన్నులను వివరించిన చరణ్ తానూ చెప్పాలన్నది చెప్పుకుంటూ వెళ్లిపొయాడు.
ఆ తర్వాత విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన కొంచెం తడబడ్డాడని లైవ్ చూసినవాళ్ళు చెప్పుకుంటున్నారు.
ఇలా ఆయన విలేకరుల ప్రశ్నలకు పూర్తిగా సమాధానం ఇవ్వకుండా మధ్యలోనే ప్రెస్ మీట్ ముగించుకుని
వెళ్ళిపోవడంపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.
విలేఖరుల ప్రశ్నలకి చరణ్ వద్ద సమాధానాలు లేవా? ఒకవేళ వుండివున్నట్లయితే ఎందుకు చెప్పకుండా
వెళ్ళిపోయాడు? జరిగిన ఘటనపై చెప్పడానికి ఎందుకు వెనుకాడాడు వంటి ప్రశ్నలు చరణ్ ప్రెస్ మీట్ చూసిన
వారిని వేధిస్తున్నాయి. ఏదిఏమైనా తానూ తప్పు చేయలేదని భావిస్తున్న చరణ్ మీడియా వాళ్ళ ప్రశ్నలకి
సమాధానాలు చెప్పివుంటే ఇప్పుడిలాంటి సందేహాలు తలెత్తేవి కావేమో!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment