Pages

Tuesday, March 5, 2013



                          సముద్ర తీరాన "గ్రీకువీరుడు" ఆడియో....

సంతోషం మూవీ తర్వాత దశరథ్ డైరెక్షన్ లో మళ్ళి నాగ్ చేస్తున్న కొత్త మూవీ గ్రీకువీరుడు.
నాగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న"గ్రీకువీరుడు"ఆడియో రీలిజింగ్ పై ఓ  క్లారిటీ వచ్చేసింది.
ఈ నెల 23న వైజాగ్ లో ఆర్ కే బీచ్ సాక్షిగా "గ్రీకువీరుడు" ఆడియో రిలీజింగ్ ఫంక్షన్ జరగనున్నట్లు చిత్ర
యూనిట్ వర్గాలు తెలిపాయి. నాగ్ సరసన జంటగా నటించిన నయనతార,మీరాచోప్రాలతో పాటు సినీ
పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్టు తెలుస్తుంది .
ఇటివలే రిలీజయిన "గ్రీకువీరుడు" ట్రయలర్ కూడా  టాలీవుడ్ ట్రేడ్ వర్గాల పట్ల ఆసక్తిని రేకెత్తించింది .
టైటిల్ కి న్యాయం చేసేలా క్యారెక్టర్ లో ఇమిడి పోవడం నాగ్ కి కొత్తేమికాకపోవడంతో  "గ్రీకువీరుడుతో"కూడా
నాగ్ న్యూ ట్రెండ్ నే సృష్టిస్తాడని ఆయన ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ మూవీ లో నాగార్జున ఓ ఎన్నారై
బిజినెస్ మాన్ గెటప్ లో కన్పించబోతున్నాడు .

కేక పుట్టిస్తున్న ''బాద్ షా'' డైలాగ్



జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న బాద్ షా మూవీరిలీజ్ కి ముందే రోజుకో వార్తతో సినీపరిశ్రమలో ఏ

సినిమా తెచ్చుకొని రీతిలో పబ్లిసిటీని మూటగట్టుకుంటోంది. ఇప్పటికే ఖరీదయిన
బడ్జెట్ తోపాటు  'బాద్ షా' గెటప్ కోసం అంతే
ఖరీదయిన కాస్ట్యూమ్స్ డిజయిన్ చేయించి
జూనియర్ పాకెట్ లో మరో రికార్డును వేశాడు నిర్మాత బండ్ల గణేష్.



దీనికి తోడు ఈ నెల 10న సినిమా ఆడియో రిలీజింగ్  కూడా  హీరో పవన్ చేత చేయించి ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ సక్సెస్ చేయలనుకుంటున్నాడు గణేష్.
ఇది ఇలా ఉండగానే తాజాగా 'బాద్ షా' కి చెందిన కేక పుట్టించే డైలాగ్ ఒకటి లీక్ అయిందని ఫిలింనగర్ టాక్
"శత్రువులకి షేర్ షా..,స్నేహానికి బానిస..,స్టేట్ కి బాద్ షా"  అనే డైలాగ్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. లీకయిన డైలాగ్ లో యంగ్ టైగర్ ఎలా ఉంటాడో ఊహించుకుంటు నందమూరి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.


డైలాగ్ తో పాటు జూనియర్ ని కూడా చూడాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే మరి.
ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయని సమాచారం. డైరెక్టర్ శ్రీను వైట్ల కథ కదా ఆ మాత్రం ఉండొద్దు మరి...

గుండెల్లో గోదారి రిలీజింగ్ డేట్.

 
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు లక్ష్మి నటించి నిర్మించిన గుండెల్లో గోదారి సినిమా ఉమెన్స్ డే పురస్కరించుకుని మార్చ్ 8న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. తాప్సీ, ఆది, మంచు లక్ష్మి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రదారులుగా రూపొందిన  ఈ సినిమా 1986 గోదారి వరదలకు ప్రేమ కథ మిక్స్ చేసి తీసినట్టుగా టాక్ .

గత సంవత్సరం 'దరువు' ఒక్క సినిమానే చేసిన తాప్సిఇందులో మొదటిసారి పల్లెటూరి అమ్మాయి 'సరళ'గా నెగటివ్ రోల్లోతన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. 27ఎకరాలలో 120 గుడిసెలతో ప్రత్యేకంగా వేసిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా చిత్రీకరించారు.