జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న బాద్ షా మూవీరిలీజ్ కి ముందే రోజుకో వార్తతో సినీపరిశ్రమలో ఏ
సినిమా తెచ్చుకొని రీతిలో పబ్లిసిటీని మూటగట్టుకుంటోంది. ఇప్పటికే ఖరీదయిన
బడ్జెట్ తోపాటు 'బాద్ షా' గెటప్ కోసం అంతే
ఖరీదయిన కాస్ట్యూమ్స్ డిజయిన్ చేయించి
జూనియర్ పాకెట్ లో మరో రికార్డును వేశాడు నిర్మాత బండ్ల గణేష్.
దీనికి తోడు ఈ నెల 10న సినిమా ఆడియో రిలీజింగ్ కూడా హీరో పవన్ చేత చేయించి ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ సక్సెస్ చేయలనుకుంటున్నాడు గణేష్.
ఇది ఇలా ఉండగానే తాజాగా 'బాద్ షా' కి చెందిన కేక పుట్టించే డైలాగ్ ఒకటి లీక్ అయిందని ఫిలింనగర్ టాక్
"శత్రువులకి షేర్ షా..,స్నేహానికి బానిస..,స్టేట్ కి బాద్ షా" అనే డైలాగ్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. లీకయిన డైలాగ్ లో యంగ్ టైగర్ ఎలా ఉంటాడో ఊహించుకుంటు నందమూరి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
డైలాగ్ తో పాటు జూనియర్ ని కూడా చూడాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే మరి.
ఇలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయని సమాచారం. డైరెక్టర్ శ్రీను వైట్ల కథ కదా ఆ మాత్రం ఉండొద్దు మరి...
No comments:
Post a Comment