మళ్ళి మత కల్లోహాలా .....?
తీవ్రవాదులు మల్లి మత కల్లోహాలు సృష్టించడానికి ప్రయత్నించారా అంటే .. అవుననే అన్పిస్తుంది.
నిన్న సాయంత్రం కోణార్క్ థియేటర్ వెంకటాద్రి థియేటర్ల దగ్గర జరిగిన వరస బాంబు పేలుళ్ళ ఘటన ఈ అనుమానాలకు తావిస్తోందిఇంటలిజెన్స్ వర్గాలు ,స్థానికుల సమాచారం ఈ విషయాన్ని ద్రువీకరిస్తుంది . నిన్న పదహారు మంది ఆగంతకులు(భారతీయులు కారు ) రెండు జట్లుగా నడుచుకుంటూ చైతన్యపురి వయిపు వెళ్లినట్టు స్థానికుల సమాచారం . సంఘటన జరగడానికి కొద్ది సేపు ముందే వారు నడుచుకుంటు వెళ్ళడం అనుమానాలకు బలమిస్తోంది .
అయితే నిన్న జరిగిన వరస పేలుళ్లు ముందుగ అనుకున్న వ్యూహం కాదని నిన్న గురువారం కావడంతో భక్తులతో కిక్కిరిసి ఉండే సాయిబాబా దేవాలయం దగ్గర జరగల్సినవిగా భావిస్తున్నారు . అయితే నిన్న బాబా టెంపుల్ లో సిటీ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో అక్కడ భద్రత కట్టు దిట్టం చేయడంతో పట్టుబడే అవకాశం ఉందని భావించిన దుండగులు దేవాలయం తర్వాత ఆ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే కోణార్క్ ,వేంకటాద్రి థియేటర్ల దగ్గర వరస పేలుళ్లు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు .
ఏది ఏమయినా అక్కడ ఈ సంఘటన జరిగి ఉంటె దాని ఫలితం ఇంకోలా ఉండేది . హైదరాబాద్ ప్రజలు సంయమనంతో వ్యవహరించి ఇలాంటి ఘటనలు మరో రంగు పులుముకోకుండా జాగ్రత్తపడాల్సిన సమయమిది.
No comments:
Post a Comment