Pages

Wednesday, February 27, 2013

                                      సునీల్ పెళ్ళికొడుకాయెనె .....


తనదైన స్టైల్ హాస్యంతొ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమేడియన్ ముద్ర వేసుకున్న సునీల్ హీరోగా కూడా తన మార్క్ స్టైల్
చూపిస్తున్నాడు. 'అందాలరాముడు'తో మొదలైన ప్రస్థానం రాజమౌళి చేతిలో 'మర్యాదరామన్న' గా ఎదిగి.. దేవి ప్రసాద్
దర్శకత్వంలో మిస్టర్ 'పెళ్లికొడుకు'గా ఒదిగిపోయాడు.
సునీల్,ఇషాచావ్ల జంటగా వస్తున్న ఈ చిత్రంలో సునీల్ స్టెప్స్ యంగ్ హీరోస్ ని తలపించేలా ఉంటాయనేది టాక్...
చిన్నతనంలో పలు డాన్స్ కాంపిటిషన్లలో బెస్ట్ డాన్సర్ గా బహుమతులు గెల్చుకున్న సునీల్ ఇపుడు సినిమాలలో
తన డాన్సులతో అదరగొడుతున్నాడు.
డాన్సర్ గా ఇండస్ట్రీకొచ్చి విలన్ కావాలనుకుని కమేడియన్ అయి ఇపుడు హీరో ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నసునీల్
జీవితంలో కఠోర శ్రమ దాగి ఉంది .సునీల్ హీరోగా మరిన్ని మంచి సినిమాలు చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ 'టాలీవుడ్ కేఫ్ .కాం' ఆల్ ది బెస్ట్ చెప్తోంది.       

No comments:

Post a Comment