మానవత్వం మరిచిన ప్రభుత్వం
రాష్ట్రంలో ఉగ్రవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం పదహారు మంది మరణానికి కారణం అయింది . బాంబు పేలుళ్ళ నుండి మరణించిన
వారిని ఎలాగు రక్షించలేక పోయిన ప్రభుత్వం కనీసం క్షతగాత్రులను అయినా ఆదుకుని సరయిన వైద్యం, ధైర్యం అందించాల్సిన భాద్యత తన మీద ఉందనే విషయమే మర్చిపోయినట్లుగా కన్పిస్తుంది .
జంట పేలుళ్ళలో తీవ్రంగా గాయపడి వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్చ పొందుతున్న వందమందికిపైగా క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రుల నుండి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది . సంఘటన జరిగిన రోజు హుటాహుటిన ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ముప్పై మంది క్షతగాత్రులకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి తగినంత స్పిరిట్,దూది,గ్లౌజేస్ కూడా లేక ఒళ్ళంతా గాయాలతో రక్తమోడుతూ హృదయ విదారకంగా ఉన్న వారికి నామమాత్రపు చికిత్సలు చేసి ఇతర ఆసుపత్రులకు పంపిన దౌర్భాగ్యపు వైనాన్ని జీర్ణించుకోకముందే ఇపుడు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలనే ప్రయత్నం తెర వెనుక జరుగుతున్నట్టు తెలుస్తుంది .
దీనిని భాదిత వర్గాల బందువులు నిరసిస్తున్నారు మామూలు అస్వస్తతకే కార్పోరేట్ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయే నాయకులకు అమాయకుల ప్రాణాలు ఇంత అల్పంగా కన్పిస్తున్నాయా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి భాదితులకు మెరుగయిన వైద్యం అందించి భాదిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
No comments:
Post a Comment