పవన్ గురించి విన్నది నిజమేనా?
టాలీవుడ్ లో పవనిజం మేనియా క్రియేట్ చేసిన పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ కు అన్ని వైపులా నుంచి ఆడియెన్స్ వున్నప్పటికీ ఆయన్నుఇప్పటికీ ఓ లోటు వేధిస్తుందని పరిశ్రమలో ఓ చిన్న టాక్. అదే ఫ్యామిలీ ఆడియెన్స్. అవును పవన్ సినిమా అంటేనే టాలీవుడ్ లో ఓ సంచలనం. అలాంటి పవన్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ లేకపోవడమేంటా అనే డౌట్ కొందర్ని వేదిస్తుండొచ్చు! కాని ఇదే విషయమై ఏకంగా పవర్ స్టారే ఆలోచనలో పడ్డారన్న వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తోందిప్పుడు.ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈసారి పవర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తోన్న మాటల మాంత్రికుడు, కథా రచయిత,డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రినివాస్ రావు తన స్టోరీని అందుకనుగుణంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తూనే పవన్ ను ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువ చేయడానికి ట్రై చేస్తోన్నఈ సినిమాను సమ్మర్లోకల్లా థియేటర్స్ లోకి తెచ్చేప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పవన్ కు- ఆయన అభిమానులకు మధ్య వున్న ఆ కొంచెం గ్యాప్ కూడా ఫిల్ల్ అయినట్లే మరి.
No comments:
Post a Comment