Himmatwala: Tamanna onceagain testing her luck in Bollywood.
తమన్నాకు అంత సీన్ లేదా?
కెమెరామెన్ గంగతో రాంబాబు, రెబల్ సినిమాల తర్వాత మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్లో బిజీగా ఉంది . అక్కడ సాజిద్ ఖాన్ దర్శకత్వంలో యాక్షన్ హీరో అజయ్ దేవగన్ తో కలిసి హిమ్మత్ వాల సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో వున్న ఈ సినిమా మార్చ్29న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.
బాలీవుడ్ లో సినీ ప్రయాణం మొదలెట్టి తర్వాత సౌత్ కి ట్రావెల్ చేసిన తమన్నా
తిరిగి ఎనిమిదేళ్ళ తర్వాత తన సొంత ఇండస్ట్రీ లో సినిమా చేస్తోంది. అందులోనూ
బాలీవుడ్ లో 1980 లో శ్రీదేవిని తిరుగులేని స్టార్ ను చేసిన హిమ్మత్ వాలా
సినిమా రీమేక్ కావడం... ఆనాటి శ్రీదేవి పాత్రే కావడం తో మళ్లీ ఈ మూవీతోనైనా
తనకు 'స్టార్' కలిసిరాకపోతుందా అని తెగ ఆశపడుతోంది.
అయితే ఇటీవలే రిలీజ్ అయిన ఆ సినిమా ట్రైలర్ చుసిన బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రం సినిమాలో తమన్నా రోల్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు లేదంటున్నారు. మరి ఈ సినిమా అయినా తమన్నా ఆశల్ని నెరవేర్చాలని ఆమె ఫ్యాన్స్ కోరిక. ఎం జరుగుతుందో తెలియాలంటే మార్చ్ నెలాఖరువరకు ఆగాల్సిందే.
No comments:
Post a Comment