ప్రభుత్వాల పాపం ప్రజలకు శాపం
హైదరాబాద్ దిల్షుకనగర్ లో జరిగిన వరస బాంబు పేలుళ్ళ ఉదంతం చూస్తుంటే ప్రభుత్వ నిఘా వైఫల్యం స్పష్టంగా అర్థం అవుతుంది . ఈ ప్రజాస్వామ్య దేశంలో దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మెట్రో సిటీలో సామాన్యులకు అడుగడుగునా దినదిన గండంగా తయారయింది . గడప దాటి కాలు బయటపెడితే తిరిగి ఇల్లు చేరే వరకు ప్రాణాలు గాల్లోనే ఉన్నట్టుగా ఉంది. ఇటీవల కసబ్ ,అఫ్జల్ గురు ఉరి శిక్ష తర్వాత ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని తెల్సి కూడా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్తలు శూన్యం . సంఘటన జరగగానే హడావుడి చేయడం నష్ట పరిహారం ప్రకటించి తమకంటిన రక్తపు మరకలు కడుక్కునే ప్రయత్నం చేయడం తప్పించి సంఘటనలు పునరావృతం కాకుండా త్వరిత గతిన దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని శిక్షించే ప్రయత్నం జరగనంత వరకు ఈ రక్త చరిత్రకు అంతం ఉండదు .
పాలకులారా మేల్కొనండి ...హత్యా ప్రయత్నాన్ని కూడా పిటి కేసులాగా చిత్రీకరించె వ్యవస్థను ,166మందిని నిలువునా పొట్టన పెట్టుకున్న నర హంతకుడి మీద 50కోట్లు ఖర్చు పెట్టి 4న్నర సంవత్సరాలు కాలయాపన చేసి భాదితుల మనసులను చిద్రం చేసే చట్టాలను మార్చే ప్రయత్నం చేయండి . ఇటువంటి సంఘటనలు విచారించడానికి రాష్ట్రాల వారిగా స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయండి . నిందితులు ఎవరయినా ఎంతటి వారయినా ,అది నిర్భయ కేసయిన బాంబు పేలుళ్ళ కేసయిన ఒకేలా విచారించండి . ప్రజాస్వామ్య ముసుగులో మనవ హక్కుల పేరుతో హంతకులను కాపాడే ప్రయత్నం చేయకండి .
ప్రజాస్వామ్యం అంటే ప్రజలంతా స్వేచ్చగా బ్రతకడానికి దోహదం కావలె తప్ప అమాయకుల ప్రాణాలు హరించి విచారణ పేరుతో స్వేచ్చగా తిరగడం కాదు. ఈ విషయంలో ప్రజా సంఘాలు, ప్రజలు సరయిన రీతిలో స్పందించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
No comments:
Post a Comment